గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 29 ఆగస్టు 2021 (10:02 IST)

దేశంలో కరోనా కేసులు పైపైకి... కొత్తగా మరో 45 వేల పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కొత్తగా మరో 45 వేల పైచిలుకు కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించిన వివరాల మేరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 45,083 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. 
 
దీంతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య మొత్తం 3,26,95,030కి చేరింది. అలాగే, నిన్న 35,840 మంది కోలుకున్నార‌ని పేర్కొంది. దేశంలో క‌రోనాతో మ‌రో 460 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,37,830కి పెరిగింది. 
 
క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 3,18,88,642 మంది కోలుకున్నారు. 3,68,558 మందికి ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్‌ల‌లో చికిత్స అందుతోంది. రిక‌వ‌రీ రేటు  97.53 శాతంగా ఉంది. కేర‌ళ‌లో నిన్న ఏకంగా 31,265 క‌రోనా కేసులు న‌మోదు కాగా, 153 మంది ప్రాణాలు కోల్పోయారు.