శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 28 ఆగస్టు 2021 (15:15 IST)

సిరాజ్‌కు ఫ్యాన్‌గా మారిన పాకిస్థాన్ యాంకర్..

హైదరాబాద్ స్పీడ్ స్టర్ మహ్మద్ సిరాజ్‌కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగిపోతోంది. తాజాగా పాకిస్థాన్‍‌కు చెందిన యాంకర్ అతగాడికి ఫిదా అయిపోయింది. సిరాజ్‌పై ప్రశంసలు కురిపించింది. 
 
వివరాల్లోకి వెళితే.. స్వతహాగా స్పోర్ట్స్ యాంకర్ అయిన జైనబ్ అబ్బాస్.. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో సిరాజ్ పెర్ఫార్మెన్స్‌ను మెచ్చుకుంది.
 
అతడి గణాంకాలు అద్భుతమని పేర్కొంది. అతడి ప్రతిభకు లార్డ్స్ టెస్ట్‌తో పాటు ఆస్ట్రేలియా సిరీస్‌లో నమోదు చేసిన గణాంకాలే నిదర్శనమని వ్యాఖ్యానించింది. సిరాజ్ ఓ ప్రపంచ స్థాయి ఉత్తమ బౌలర్ అని కొనియాడింది. 
Anchor Abbas
 
ప్రస్తుతం ఇంగ్లండ్ లో జరుగుతున్న ది హండ్రెడ్ లీగ్‌‌‌లో ఆమె యాంకర్‌గా చేస్తోంది. జైనబ్ స్వస్థలం లాహోర్. ఆమె తండ్రి నజీర్ పాక్ దేశవాళీ క్రికెట్ టోర్నీల్లో ఆడాడు. ఇంగ్లండ్‌లోని వార్విక్ యూనివర్సిటీలో మార్కెటింగ్ అండ్ స్ట్రాటజీలో ఎంబీఏ చేసినా.. తండ్రి క్రికెటర్ కావడంతో ఆమె స్పోర్ట్స్ వైపు అడుగులు వేసింది.