బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 27 ఆగస్టు 2021 (19:59 IST)

ప్రముఖ నిర్మాత నౌషాద్ కన్నుమూత

మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత నౌషద్ కన్నుమూశారు. ఆయన వయసు 55 సంవత్సరాలు. ఈయన కేవలం నిర్మాతగానే కాకుండా ప్రముఖ పాకశాస్త్ర నిపుణుడు (చెఫ్)గా కూడా మంచి పేరు గడించారు. 
 
గత కొన్ని రోజులుగా ఉదర సంబంధిత వ్యాధులతో బాధపడుతూ వచ్చిన ఆయన.. కేరళలోని తిరువళ్లలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కాగా, రెండు వారాల క్రితమే నౌషాద్ భార్య షీబా తుది శ్వాస విడిచింది. ఈ దంపతులకు వారి 13 ఏళ్ల కుమార్తె నశ్వ ఉంది. నౌషాద్ మరణం సినీ పరిశ్రమ మరియు ఆహార వ్యాపారంలో ఉన్న ప్రతి ఒక్కరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.