గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 31 జులై 2021 (10:43 IST)

కత్తితో పొడవడానికి వచ్చిన భర్తను.. భార్యే కడతేర్చింది

మద్యం కుటుంబాలలో చిచ్చు రేపుతోంది. మద్యం మత్తులో దారుణాలకు తెగబడుతున్నారు కొంతమంది. భార్యలపై దాడులు చేస్తూ..చివరకు ప్రాణాలు తీస్తున్నారు. ఇలాగే ఓ ఘటన జరిగింది. మద్యం మత్తులో కత్తితో పొడవడానికి వచ్చిన ఓ భర్తను.. భార్యే కడతేర్చింది. ఈ ఘటన కాంచీపురంలో చోటు చేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. కాంచీపురం మల్లిగశెట్టి వీధిలో నౌషద్ (37), రేవతి (30) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి కుమార్తె, కుమారుడున్నాడు. నౌషధ్ ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. నౌషధ్ మద్యానికి అలవాటు పడ్డాడు. రోజు మద్యం తాగి వచ్చి.. భార్యతో గొడవపడేవాడు.
 
ఈ క్రమంలో నౌషద్ గురువారం అర్ధరాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చాడు. దంపతుల మధ్య గొడవ ప్రారంభమైంది. ఆగ్రహానికి గురైన నౌషద్ కత్తి తీసుకుని ఆమెపై దాడి చేయడానికి ప్రయత్నించాడు. ఆమె తప్పించుకోవడంతో..అదుపుతప్పి కిందపడ్డాడు. 
 
రషియా వెంటనే అదే కత్తి తీసుకుని అతనిపై దాడి చేసింది. దాడిలో నౌషద్ అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు రేవతిని అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.