గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

పెళ్లికి ముందు అత్యాచారం... భార్యను కొండ పైనుంచి కిందికి తోసేసిన భర్త

ఓ యువతిపై ఓ వ్యక్తి ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. ఆ వ్యక్తి మాటలు నమ్మిన ఆమె.. పెళ్లికి ముందే శారీరకంగా కలిసింది. ఆ తర్వాత బలవంతంతో పెళ్లి చేసుకున్నాడు. ఆ యువతిని పెళ్లి చేసుకోవడం ఇష్టంలోని ఆ వ్యక్తి కట్టుకున్న భార్యను కొండపైకి తీసుకెళ్లి కిందికి తోసేశాడు. ఈ దారుణం నైనిటాల్‌లో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు ప్రతి చిన్న విషయాన్ని గొడవపడసాగారు. ఈ క్రమంలో భార్యను టూర్ పేరుతో ఓ కొండపైకి తీసుకెళ్లిన భర్త అక్కడ నుంచి ఆమెను కిందికి తోసి హత్య చేశాడు. ఈ దారుణం జూన్‌లో జరుగగా పోలీసులు మాత్రం నిందితుడిని ఇటీవల అదుపులోకి తీసుకున్నారు. 
 
ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంట... గతనెలలో భర్తతో జరిగిన గొడవ కారణంగా భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. జూన్ 11న నిందితుడు ఆమెను బుజ్జగించి తన స్వస్థలమైన ఉత్తరాఖండ్‌కు తీసుకెళ్లాడు. 
 
ఆ తర్వాత టూరుకెళదామంటూ ఆమెను నైనిటాల్ తీసుకెళ్లి అక్కడున్న ఓ కొండపై నుంచి తోసేశాడు. తమ కూతురు కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో నిందితుడు చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది.
 
 
నిందితుడు టూర్‌ పేరిట భార్యను ఓ కొండపైకి తీసుకెళ్లి  కిందకు తోసేశాడని పోలీసులు తెలిపారు. వాస్తవానికి పెళ్లికి ముందే తనపై అత్యాచారం చేశాడని ఆమె అతనిపై కేసు పెట్టింది. ఆ తర్వాత తామిద్దరం పెళ్లి చేసుకుంటామని చెప్పిన ఆమె తన ఫిర్యాదును వెనక్కు తీసుకుంది. 
 
అయితే.. పెళ్లైన తరువాత కూడా భార్యాభర్తలు తరచూ గొడవపడే వారని పోలీసులు తెలిపారు. చిన్న చిన్న విషయాలపై కూడా తమ కూతురిని అల్లుడు ఇబ్బంది పెట్టేవాడని బాధితురాలి పుట్టింటి వారు ఆరోపించారు.