బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 24 జూన్ 2021 (20:02 IST)

సుప్రీం ఆదేశాల ప్రకారం జూలై 31లోపు అది కుదరదు.. విద్యాశాఖ

ఏపీలో పరీక్షలు రద్దు అయ్యాయి. ఏపీలో ప‌రీక్షల నిర్వ‌హ‌ణ‌పై విద్యా శాఖ మంత్రి ఆదిమూల‌పు కీల‌క నిర్ణ‌యం ప్ర‌క‌టించారు. 31 జూలైలోపు ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించాల‌ని సుప్రీం కోర్టు ఆదేశించిన నేప‌థ్యంలో.. ఆ స‌మ‌యంలో ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌డం సాధ్యం కాద‌ని చెప్పిన మంత్రి ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపారు. 
 
ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేసిన నేప‌థ్యంలో మార్కులు ఎలా ఇస్తామ‌న్న విష‌యాన్ని త‌ర్వాత ప్ర‌క‌టిస్తామ‌ని మంత్రి తెలిపారు. మార్కుల‌ను కేటాయించే క్ర‌మంలో ఒక హై ప‌వ‌ర్ క‌మిటీని ఏర్పాటు చేస్తామ‌ని తెలిపారు. ప్ర‌స్తుతం త‌మ వ‌ద్ద ఇంట‌ర్ సెకండ్ ఇయ‌ర్ విద్యార్థ‌లు ల్యాబ్ మార్కులు మాత్ర‌మే ఉన్నాయ‌ని మంత్రి చెప్పుకొచ్చారు.
 
క‌రోనా కార‌ణంగా దేశంలోని చాలా రాష్ట్రాల్లో పరీక్ష‌ల‌ను ర‌ద్దు చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఏపీలో మాత్రం విద్యార్థుల భ‌విష్య‌త్తును దృష్టిలో పెట్టుకొని ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌భుత్వం చెబుతూ వ‌చ్చింది. ఇందులో భాగంగానే ఎట్టి ప‌రిస్థితుల్లో ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌భుత్వం చెబుతూ వ‌చ్చింది. కానీ సుప్రీం మాత్రం క‌రోనా నేప‌థ్యంలో ప‌రీక్షల‌ను ర‌ద్దు చేయాల‌ని ఆదేశించింది. 
 
ఈ క్ర‌మంలో విద్యాశాఖ మంత్రి ఆది మూల‌పు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఏపీలో ఇంట‌ర్‌, ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేస‌స్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. సుప్రీం ఆదేశించిన గ‌డువులో ప‌రీక్ష‌ల‌ను పూర్తి చేయ‌లేని కార‌ణంగా ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు మంత్రి ప్ర‌క‌టించారు. విద్యార్థులు ఏ ర‌కంగా ఇబ్బందులు ప‌డ‌కూడ‌ద‌నే ఉద్దేశంతోనే ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని మంత్రి తెలిపారు.