ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 24 జూన్ 2021 (18:25 IST)

ఆగస్టు 19 నుంచి ఆగస్టు 25 వరకు ఏపీలో ఎంసెట్ పరీక్షలు

ఏపీలో ఎంసెట్ పరీక్షలకు టైమ్ టేబుల్ విడుదలైంది. ఐసెట్, ఈసెట్, పీజీఈసెట్, లాసెట్, ఎడ్‌సెట్, పీఈసెట్ ప్రవేశ పరీక్షలను సెప్టెంబర్ మొదటి, రెండో వారంలో నిర్వహించే అవకాశం వుంది. ఇక ఎంసెట్ పరీక్షలు ఆగష్టు 19 నుంచి ఆగష్టు 25 వరకు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఇంటర్ బోర్డు కార్యదర్శి ఒమర్ జలీల్ వెల్లడించారు. ఈ మేరకు నోటిఫికేషన్‌ను తాజాగా విడుదల చేశారు. దరఖాస్తుల స్వీకరణకు గతంలో సూచించిన తేదీలను సవరించి.. మరోసారి కొత్త తేదీలను ప్రకటించారు.
 
కొత్తగా విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం, అపరాధ రుసుము లేకుండా జూన్ 30వ తేదీ వరకు ఎంసెట్ దరఖాస్తులను స్వీకరిస్తారని తెలిపారు. రూ. 5000 లేట్ ఫీజుతో జూలై 7 వరకు, రూ. 10 వేలు అపరాధ రుసుముతో జూలై 14 వరకు, రూ. 15 వేలు లేట్ ఫీజుతో జూలై 22 వరకు, రూ. 20 వేలు అపరాధ రుసుముతో జూలై 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని అన్నారు. 
 
కరోనా నేపధ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుని పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ప్రతీ సెంటర్‌ను శానిటైజ్ చేస్తామని.. విద్యార్ధుల మధ్య భౌతిక దూరం ఉండేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.