1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Andhra Pradesh Government appoints Specified Authority for TTD

తితిదే పాలక మండిలికి మంగళం... ఇకపై స్పెసిఫైడ్ అథారిటీ

TTD
ఆంధ్రప్రశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలికి మంగళంపాట పాడింది. ఈ పాలక మండలి స్థానంలో విశేష అథారిటీ(స్పెసిఫైడ్‌ అథారిటీ)ని నియమించింది. ఈ అథారిటీకి చైర్మన్‌గా టీటీడీ ఈవో, కన్వీనర్‌గా అదనపు ఈవో ఉంటారని తెలిపింది.
 
ప్రస్తుతం వైవీ సుబ్బారెడ్డి సారథ్యంలోని ట్రస్టు బోర్డు కాలపరిమితి ముగియడంతో ఈ అథారిటీని నియమించినట్లు బుధవారం జారీ చేసిన జీవోలో పేర్కొంది. తదుపరి ఆదేశాల వరకూ ఈ అథారిటీ కొనసాగుతుందని, ట్రస్టు బోర్డు నిర్వర్తించే కార్యకలాపాలన్నీ ఈ అథారిటీ చేపడుతుందని వివరించింది. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. 
తర్వాతి కథనం
కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌కు ఈసీ షాక్