మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : గురువారం, 24 జూన్ 2021 (19:12 IST)

తెలుగు రాష్ట్రాల్లో కరోనా అప్డేట్.. ఏపీలో 4వేలు.. తెలంగాణలో వెయ్యి కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,981 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో 38 మంది మరణించారు. 6,464 మంది వ్యాధి నుంచి కోలుకుని పూర్తిగా కోలుకున్నారు. తాజా కేసులతో కలుపుకుని ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,67,017కి చేరుకుంది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 49,683 గా ఉంది.
 
తెలంగాణలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,088 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 6,17,776కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. 
 
గత 24 గంటల్లో కరోనా బారినపడి 9 మంది మరణించారు. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 1,511 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటి వరకు 5,98,139 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 16,030 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.