బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : మంగళవారం, 5 అక్టోబరు 2021 (09:48 IST)

నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌ న్యూస్‌!

నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ శుభవార్త చెప్పింది. త్వరలోనే 670 జూనియర్‌ అసిస్టెంట్స్‌, మరో 190 అసిస్టెంట్‌ ఇంజనీర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ చేస్తామని ఏపీపీఎస్సీ సెక్రటరీ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు తెలిపారు.

ఈ సందర్భంగా విజ‌య‌వాడ‌లోని ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో పీఎస్ఆర్‌ ఆంజనేయులు మాట్లాడుతూ..‘‘త్వరలోనే జూనియర్‌ అసిస్టెంట్స్‌, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ చేస్తాం.

ఒక్కొక్కటిగా వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తాం. గ్రూప్‌-1 మెయిన్స్‌ మూల్యాంకణంపై ఏపీ హైకోర్టు తీర్పును గౌరవిస్తాము’’ అని తెలిపారు.