గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (15:15 IST)

ఏపీ సర్కారు శుభవార్త - రుణాలు పొందేందుకు పచ్చజెండా

ఆర్థిక కష్టాల్లో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది నిజంగానే శుభవార్త. ఏపీ సర్కారు అదనపు రుణాలు పొందేందుకు కేంద్ర ఆర్థికశాఖ పచ్చజెండా ఊపింది. కొత్తగా రూ.2,665 కోట్ల సమీకరణకు అనుమతి ఇచ్చింది. 
 
మూలధన వ్యయం కోసం లక్ష్యాన్ని చేరుకున్న 11 రాష్ట్రాలకు అనుమతి ఇవ్వగా అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఉండటం గమనార్హం. దీంతో రాష్ట్రానికి 2021 - 22 త్రైమాసిక-1లో అదనపు రుణాలు పొందేందుకు అనుమతి వచ్చినట్లు అయింది. 
 
ఫలితంగా మార్కెట్‌ నుంచి అదనంగా ఏపీ రూ.15,721 కోట్ల సమీకరణ చేసుకోవచ్చని కేంద్రం తెలిపింది. కేంద్రం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకున్నందుకు కేంద్రం ప్రోత్సాహకం ఇచ్చింది. ఇందులో భాగంగానే 11 రాష్ట్రాలకు అదనపు రుణ సమీకరణకు అవకాశం కల్పించింది.