బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (13:22 IST)

ఏపీ ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల.. 92.85% మంది అర్హత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎమ్ సెట్ (ఈఏపీ సెట్) అగ్రి, ఫార్మా ప్రవేశ పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. తాజాగా అగ్రి, ఫార్మా ప్రవేశ పరీక్షా ఫలితాలను ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆది మూలపు సురేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మాట్లాడుతూ.. ఏపీ ఈఏపీ సెట్‌లో ఇంజనీరింగ్, అగ్రి, ఫార్మాకు మొత్తంగా 2,59,688 విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.
 
అగ్రి, ఫార్మా ప్రవేశ పరీక్షల కోసం 83,820 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. ఇక ఈ పరీక్షలకు 78,066 మంది విద్యార్థులు హాజరు కాగా 72,488 మంది విద్యార్థులు అర్హత సాధించారని ఆయన వెల్లడించారు. 
 
ఇక హాజరైన విద్యార్థుల్లో 92.85% మంది విద్యార్థులు అర్హత పొందారన్నారు. అలాగే రేపటి నుంచి ర్యాంక్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన జేఎన్టీయూ కాకినాడకు, అధికారులకు, సిబ్బంది, ప్రభుత్వ యంత్రాంగానికి అభినందనలు తెలిపారు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.