ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. 12 మంది మృతి
ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 38,746 శాంపిల్స్ పరీక్షించగా.. 864 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. మరో 12 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు.
చిత్తూరులో నలుగురు, నెల్లూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలో ఒక్కొక్కరు మరణించారు. ఇక, ఇదే సమయంలో 1,310 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.
తాజా టెస్ట్‌లు కలుపుకుని ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య 2,73,63,641కు చేరుకున్నాయి.. ఇక, పాజిటివ్ కేసుల సంఖ్య 20,30,849కు పెరిగితే.. కోలుకున్నవారి సంఖ్య 20,02,187కు చేరుకుంది.
మరోవైపు ఇప్పటి వరకు కోవిడ్ బారినపడి మృతిచెందినవారి సంఖ్య 14,010కు పెరగగా.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 14,652 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. ఇక, తాజా కేసుల్లో అత్యధికంగా నెల్లూరులో 141, తూర్పు గోదావరి జిల్లాలో 135, కడరపలో 117, ప్రకాశం జిల్లాలో 114, చిత్తూరులో 101 కేసులు అత్యధికంగా నమోదయ్యాయి.