సంబంధిత వార్తలు
- ఆంధ్రప్రదేశ్ కాదు.. ఆత్మహత్యల ప్రదేశ్ : నారా లోకేష్
- కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం : 8 మంది దుర్మరణం
- ఆంధ్రప్రదేశ్-తెలంగాణాలలో శ్రీరామ్ హౌసింగ్ ఫైనాన్స్ నెలకు 100 కోట్ల రూపాయల ఋణాలు లక్ష్యం
- ఆంధ్రాలో కొత్తగా 1190 కరోనా పాజిటివ్ కేసులు
- కల్తీ మాంసం - చికెన్‌ను విక్రయించేందుకే మటన్ మార్టులా: బుద్ధా వెంకన్నా
కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆంధ్రా కూలీలు దుర్మరణం
కర్నాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎనిమిది మంది కూలీలు మృత్యువాతపడ్డారు. ఈ ప్రమాదం కర్ణాటకలోని చిక్‌బల్లాపూర్ జిల్లాలో సంభవించింది.
ఆదివారం రాత్రి ఎదురుగా వస్తున్న లారీని ఓ జీపు ఢీకొట్టింది. దీంతో జీపులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు. దినసరి కూలీలతో వెళ్తున్న జీపు చింతామణి సమీపంలోని మరనాయకహళ్లి వద్ద ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడటంతో ఈ ప్రమాదం జరిగింది.
మృతి చెందిన ఎనిమిది మందిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ కూలీలంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారని పోలీసులు తెలిపారు. వారంతా కూలీలని, పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగిందని వెల్లడించారు. గాయపడినవారిని దవాఖానకు తరలించామన్నారు.
తర్వాతి కథనం
