గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎంజీ
Last Updated : సోమవారం, 13 సెప్టెంబరు 2021 (11:04 IST)

రాహుల్‌ని అధ్యక్షుడిగా చేయండి: ఎన్‌ఎస్‌యూఐ ప్రతిపాదన

రాహుల్ గాంధీని తిరిగి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించాలని యూత్ కాంగ్రెస్ అప్పట్లో ప్రతిపాదించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగమైన భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్‌ఎస్‌యూఐ) కూడా ఇదే ప్రతిపాదన చేసింది. రెండు రోజుల పాటు నిర్వహించిన ‘సంకల్ప్’ అనే కార్యక్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

‘‘రాహుల్ గాంధీ అగ్రనేత, నిజాయితీ కలిగిన వ్యక్తి. విద్యార్థుల కోసం ఆయన తన బలమైన గొంతుకను వినిపించారు. అంతే కాకుండా విద్యార్థి సమస్యల పరిష్కారానికి ఆయన ఎప్పటికప్పుడు కృషి చేస్తూనే ఉన్నారు. విద్యార్థిల్లో ప్రజాస్వామ్యం, పారదర్శకత పెంచుతున్నారు. విద్యార్థులతో సోదరభావం కలిగిన వ్యక్తి. రాహుల్ గాంధీ నిబద్ధతను మేము గుర్తించాం.

ఆయన నాయకత్వం మంచి భవిష్యత్‌ను చూపిస్తుందని మాకు నమ్మకం ఉంది. సమాజానికి మేలు జరుగుతుందని కూడా అనుకుంటున్నాం. అందుకే రాహుల్ గాంధీని మళ్లీ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించాలి’’ అని ఎన్‌ఎస్‌యూఐ విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.