1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Budha Venkanna Comments On AP Decision Over Mutton Marts

కల్తీ మాంసం - చికెన్‌ను విక్రయించేందుకే మటన్ మార్టులా: బుద్ధా వెంకన్నా

Budha Venkanna
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే మటన్, చికెన్ విక్రయాల కోసం మటన్ మార్టులు పెట్టబోతుందని అధికార వైకాపాకు చెందిన సొంత పత్రిక సాక్షిలో వచ్చిన ఓ వార్త ఇపుడు హల్చల్ చేస్తోంది. ఈ వార్తపై పెను చర్చకే దారితీసింది. 
 
ఈ మటన్ మార్టుల వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ ఏపీ శాఖ ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. మాంసం, చేపలు, రొయ్యలు అమ్ముకుని బతికే బడుగు, బలహీన వర్గాల కడుపు కొట్టేందుకే ఈ మార్టులను ఏర్పాటు చేస్తున్నారంటూ విమర్శించారు.
 
పీజీలు, డిగ్రీలు చేసిన వారికి ఉద్యోగాలు ఇవ్వలేని అసమర్థ సీఎం.. వారికి మటన్ కొట్లలో ఉద్యోగాలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇప్పటికే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కల్తీ మద్యం తాగి ఎంతో మంది చనిపోతున్నారని విమర్శించారు. 
 
ఇపుడు కొత్తగా పెట్టబోయే మటన్ మార్టుల్లో కల్తీ మాంసం, చేపలను అమ్మేందుకే ఈ ఎత్తుగడ అంటూ ఆరోపించారు. తన అక్రమాస్తుల కేసుల్లో ఏ2గా ఉన్న విజయసాయి రెడ్డి సలహాతోనే ఏపీ సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని, వారి ఖజానా నింపుకొనేందుకే ఈ నిర్ణయమని ఆరోపించారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
మంగళగిరి రూరల్ ఎస్సై పైన డాక్టర్ యామిని ఫిర్యాదు