శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 సెప్టెంబరు 2021 (18:22 IST)

ఏపీలో క్రమంగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రమంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 1608 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 67,911 కరోనా పరీక్షలు నిర్వహించారు. కొత్త కేసుల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 281 మందికి కరోనా నిర్ధారణ అయ్యాయి. 
 
ఆ తర్వాత నెల్లూరు జిల్లాలో 261, తూర్పు గోదావరి జిల్లాలో 213, కృష్ణా జిల్లాలో 161, పశ్చిమ గోదావరి జిల్లాలో 154 కేసులు గుర్తించారు. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 14 కేసులు వెల్లడయ్యాయి. అదేసమయంలో 1,107 మంది కరోనా నుంచి కోలుకోగా, ఆరుగురు మరణించారు. 
 
రాష్ట్రంలో ఇప్పటివరకు 20,27,650 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 19,98,561 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 15,119 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 13,970కి పెరిగింది. అలాగే, రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చర్యల్లో భాగంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా జోరుగా సాగుతోంది.