1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. andhra pradesh new cheif secretary sameer sharma

ఆంధ్ర ప్ర‌దేశ్ కొత్త సీఎస్ గా ఐ.ఎ.ఎస్. అధికారి సమీర్ శర్మ

andhra pradesh
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి కొత్త ఛీఫ్ సెక్ర‌ట‌రీగా సమీర్‌ శర్మ ఎంపిక అయ్యారు. రాష్ట్ర‌ ప్ర‌భుత్వం స‌మీర్ శ‌ర్మ‌ను కొత్త సీఎస్ గా నియ‌మిస్తూ, జీవో విడుదల చేసింది. ఇప్ప‌టికీ ప‌నిచేస్తున్న సీ.ఎస్. ఆదిత్యనాద్ దాస్ ఈ నెలాఖ‌రున పదవి విరమణ చేయ‌నున్నారు. 
 
అందుకే ఆయ‌న స్థానంలో 1985 బ్యాచ్ ఐ.ఎ.ఎస్. అధికారి సమీర్ శర్మను నియ‌మిస్తూ, రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. కొత్త‌గా ఎంపిక అయిన   ఛీఫ్ సెక్ర‌ట‌రీగా సమీర్‌ శర్మ వ‌చ్చే అక్టోబర్ 1 నుంచి బాధ్యతలు స్వీక‌రిస్తారు.
తర్వాతి కథనం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త సీఎస్‌గా సమీర్ శర్మ