1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Mutton marts in Andhra pradesh

ఏపీలో రూ.11.20 కోట్లతో 112 మటన్ మార్ట్‌లు

Mutton Marts
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మటన్ మార్ట్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తొలి దశలో విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో నాలుగు చెప్పున మార్ట్ లను ఏర్పాటు చేయనున్నారు.

అనంతరం మిగిలిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మార్ట్‌లను విస్తరించనున్నారు. మొత్తం రూ. 11.20 కోట్లతో 112 మార్ట్ లను ఏర్పాటు చేయనున్నారు. 
 
ఆరోగ్యకరమైన మాంసం వినియోగాన్ని పెంచడమే లక్ష్యంగా మార్ట్‌లను ఏర్పాటు చేస్తున్నారు. పరిశుభ్రమైన వాతావరణంలో మాసం విక్రయాలు జరుగుతాయని అధికారులు తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం మద్యం షాపులను నేరుగా నిర్వహిస్తోంది. ఇప్పుడు మాంసం విక్రయాల్లోకి అడుగులు వేస్తోంది.
తర్వాతి కథనం
ఇండియాలో FORD తయారీ మూసివేత: నష్టాలే కారణమా?