సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 9 సెప్టెంబరు 2021 (18:40 IST)

ఏపీలో భయపెడుతున్న కరోనా కేసులు.. తగ్గినట్టే తగ్గి పెరిగాయ్!

ఏపీ పెరుగుతున్న పాజిటివ్ కేసులు భయపెడుతున్నాయి. ఈ వారం మొదటి రోజు వెయ్యి లోపు కేసులు నమోదు కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఆ రోజు నుంచి ప్రతిరోజూ వందకు పైగా కేసులు పెరుగుతూనే వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 62 వేల 857 మంది శాంపిల్స్ పరీక్షించగా.. 1,439 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. గత 24 గంటల్లో 1,311 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని.. డిశ్చార్జ్ అయ్యారు. 
 
మృతుల విషయంలో కృష్ణాజిల్లా భయపెడుతూనే ఉంది. తాజాగా కరోనా కారణంగా మరో నలుగురు మరణించారు. కృష్ణాజిల్లాలో నలుగురు, చిత్తూరులో ముగ్గురు, ప్రకాశంలో ఇద్దరు, పశ్చిమ గోదావరిలో ఇద్దరు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖల్లో ఒక్కరి చొప్పున మరణించారు. గడిచిన 24 గంటల్లో 15 మంది కరోనా సోకి మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 13,964కి పెరిగింది.