గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 సెప్టెంబరు 2021 (18:35 IST)

ఆంధ్రాలో కొత్తగా 1190 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మరో 1190 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్యపై ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. 
 
మొత్తం 45,533 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, వీరిలో 1,190 మందికి పాజిటివ్ అని తేలింది. ఈ కేసుల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 219 కొత్త కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 164, నెల్లూరు జిల్లాలో 139, ప్రకాశం జిల్లాలో 121 కేసులు గుర్తించారు. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 10 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
 
అదేసమయంలో 1,226 మంది కరోనా నుంచి కోలుకోగా, 11 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,29,985 పాజిటివ్ కేసులు నమోదు కాగా 20,00,877 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 15,110 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 13,998కి పెరిగింది.