1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. Today Media Bulletin on Covid Positive Cases

దేశంలో మరోమారు 30 వేల దిగువకు కరోనా కేసులు

Covid Positive Cases
దేశంలో మరోమారు 30 వేల దిగువకు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆదివారం 28 వేల మంది కరోనా బారిన పడగా, తాజాగా మరో 27 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒక్క కేరళ రాష్ట్రంలోనే 20 వేలకు పైగా కేసులు ఉన్నాయి. ఇది నిన్నటికంటే 4.6 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 
 
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల మేరకు గత 24 గంటల్లో కొత్తగా 27,254 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,32,64,175కు చేరింది. ఇందులో 3,24,47,032 మంది కరోనా నుంచి బయటపడగా, 3,74,269 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 
 
మరో 4,42,874 మంది బాధితులు మరణించారు. కాగా, ఆదివారం ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 219 మంది మృతిచెందగా, 37,687 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారని ఆరోగ్యశాఖ తెలిపింది.
 
మరోవైపు, కొత్తగా నమోదైన కేసుల్లో కేరళలోనే 20,240 కేసులు ఉన్నాయని, కొత్తగా 67 మంది మృతిచెందారని వెల్లడించింది. ఇక కరోనా వ్యాక్సినేషన్‌ జోరుగా సాగుతున్నదని తెలిపింది. గత 24 గంటల్లో 53,38,945 మందికి వ్యాక్సినేషన్‌ చేశామని పేర్కొన్నది. దీంతో ఇప్పటివరకు 74,38,37,643 కరోనా వ్యాక్సిన్లను పంపిణీ చేశామని వెల్లడించింది. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
రూ.5లు తక్కువైందని.. హోటల్ యజమాని అంత పనిచేశాడా?