గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 22 సెప్టెంబరు 2021 (09:19 IST)

టిటిడి గుడ్ న్యూస్.. బస్సులో తీసుకెళ్లి ఫ్రీ దర్శనం

టిటిడి జిల్లాల్లో స్వామివారి ఆలయాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయా జిల్లాల్లోని వెనక బడిన ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు టిటిడి గుడ్ న్యూస్ చెప్పింది. వారిని బస్సులో ఉచితంగా తీసుకువచ్చి స్వామి వారి దర్శనం చేయించేందుకు నిర్ణయం తీసుకుంది. 
 
ఈ విషయాన్ని టిటిడి ఈవో జవహర్ రెడ్డి వెల్లడించారు. స్థానిక అన్నమయ్య భవనం లో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జవహర్ రెడ్డి మాట్లాడుతూ… వచ్చేనెల 7 నుండి 15 తేదీల మధ్య సాలకట్ల బ్రహ్మోత్సవాలు నితవించనున్నట్టు తెలిపారు.
 
ఈ సందర్భంగా 500 నుండి 1000 మంది భక్తులకు దర్శనం కల్పించాలని నిర్ణయించారు. దానికోసం కావాల్సిన విధి విధానాలను సిద్దం చేయాలని అధికారులకు జవహర్ రెడ్డి ఆదేశించారు. 
 
అదే విధంగా బ్రహ్మోత్సవాల సందర్భంగా అలిపిరి మార్గాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఇదిలా ఉండగా అక్టోబర్ కు సంబందించి రూ. 300 ప్రత్యేక దర్శనం టికెట్లను రేపు ఉదయం 9గంటలకు ఆన్లైన్ లో విడుదల చేయనున్నట్టు తెలిపారు.