శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 19 సెప్టెంబరు 2021 (16:05 IST)

తిరుపతిలో తృటిలో తప్పిన పెను ప్రమాదం

తిరుపతిలో ఆదివారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. తిరుపతి పట్టణంలోని రామానుజ సర్కిల్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఏర్పాటు చేసిన స్వాగత తోరణం (ఆర్చి) ఒక్కసారిగా ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది. 
 
స్థానిక రిలయన్స్ మార్ట్ వద్ద దీన్ని ఏర్పాటు చేయగా, అది కూలిపోయింది. ఈ ప్రమాదం రెండు కార్లు ధ్వంసమయ్యాయి. ఒక వ్యక్తి గాయపడ్డాడు. భారీ లోడుతో వచ్చిన లారీ ఒకటి ఆర్చిని తగలడంతో అది కూలిపోయినట్టు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని కూలిపోయిన ఆర్చిని శిథిలాలను తొలగించారు.