గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

19-09-2021 ఆదివారం రాశిఫలాలు - సూర్యస్తుతి ఆరాధించిన శుభం.. జయం

మేషం : ప్రయాణాలలో వ్యాపకాలు, పరిచయాలు అధికమవుతాయి. కొన్ని సందర్భాల్లో మీరు ఇతరుల గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతాయి. మీరు చేయదలుచుకున్న ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా సాగవు. క్రయ, విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. వస్త్రాలు, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. 
 
వృషభం : చేతి వృత్తుల వారివారికి అన్ని విధాలా పురోభివృద్ధి కానవస్తుంది. విందులు, విలాసాలలో మితంగా వ్యవహరించండి. స్త్రీల ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. 
 
మిథునం : మీ కళత్ర మొండివైఖరిలో మార్పు సంతోషపరుస్తుంది. చేపట్టిన పనులు ఒక పట్టాన పూర్తికావు. వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ, రసాయన సుగంధ ద్రవ్య వ్యాపారాలు కలిసివస్తుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఇతరుల సహాయం అర్థించడానికి మొహమ్మాటం అడ్డువస్తుంది. స్త్రీలపై ఆత్మీయుల హితోక్తులు బాగా పనిచేస్తాయి. 
 
కర్కాటకం : శ్రీమతిని, పిల్లలను మెప్పించడం కష్టమవుతుంది. ధనం ఎంత వ్యయం చేసినా ఫలితం ఉండదు. ఆప్తుల రాకతో మానసికంగా కుదుటపడతారు. భాగస్వామిక చర్చలు, ఉమ్మడి వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. 
 
సింహం : నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఊహించని ఖర్చులు చెల్లింపుల వల్ల స్వల్ప ఇబ్బందులు తప్పవు. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దైవ, పుణ్య కార్యాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. మత్స్య, కోళ్ల, గొర్రెల వ్యాపారస్తులకు కలిసిరాగలదు. 
 
కన్య : ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన  సమసిపోగలవు. ఎదుటివారితో సంభాషించేటపుడు మెళకువ అవసరం. విలువైన కానుక ఇచ్చిన మీ శ్రీమతిని ప్రసన్నం చేసుకుంటారు. మార్కెట్ రంగాల వారికి, పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. వాహన చోదకులకు ఊహించని చికాకులు తలెత్తుతాయి. 
 
తుల : ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి. వస్తువులపట్ల ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలు కళాత్మక, క్రీడ, క్విజ్ పోటీల్లో రాణిస్తారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సామాన్యం. రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఒత్తిడి తప్పదు. వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు, ప్రణాళికలు సత్ఫలితాలనిస్తాయి. 
 
వృశ్చికం : ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి సామాన్యం. విద్యార్థులకు తొందరపాటుతనం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. కార్యదీక్షతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. ఎదుటివారి నుంచి విమర్శలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. మీ సంతానం విద్యా విషయాలు సంతృప్తినిస్తాయి. 
 
ధనస్సు : హామీలు, ఇతరులకు ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన చాలా అవసరం. దూర ప్రయాణాలలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆలయాలను సందర్శిస్తారు. మిత్రులతో సంభాషించడం వల్ల మీలో మానసికధైర్యం, కొత్త ఉత్సాహం చోటుచేసుకుంటాయి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలు సత్ఫలితాలను ఇస్తాయి. 
 
మకరం : వాహనం ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. ప్రేమికులకు పెద్దల నుంచి తీవ్ర వ్యతిరేకత, ఇతరత్రా చికాకులు అధికమవుతాయి. స్త్రీలకు ఆరోగ్య విషయంలో ఏమరుపాటు, అశ్రద్ధ కూడదు. మీ సమస్య ఒకటి సానుకూలం కావడంతో మానసికంగా కుదుటపడతారు. రుణం తీర్చాలనే మీ యత్నం నెరవేరగలదు. 
 
కుంభం : సహ్యోద్యోగులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. విజ్ఞతాయుతంగా వ్యవహరించి మీ గౌరవాన్ని కాపాడుకోండి. దంపతుల మధ్య అవగాహనా లోపం చికాకులు వంటివి చోటుచేసుకుంటాయి. రాబడికి మించిన ఖర్చులు అధికమవుతాయి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో నూతన పరిచయాలేర్పడతాయి. 
 
మీనం : ఆర్థికంగా ఎదగడానికి మీరు చేసే యత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. స్త్రీల మాటకు కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. ప్రముఖుల కలయికతో పనులు పూర్తవుతాయి. బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం విరివిగా ఖర్చు చేస్తారు.