గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

14-09-2021 మంగళవారం దినఫలాలు - ఉమాపతిని ఆరాధించిన శుభం

మేషం : ఆర్థికంగా కొంతవరకు కుదుటపడతారు. నూతన పెట్టుబడులు, లీజు, ఏజెన్సీలకు సంబంధించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. బ్యాంకు వ్యవహారాల్లో అప్రమత్తంగా మెలగండి. అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. 
 
వృషభం : ఉద్యోగస్తుల కనిష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆత్మీయుల ఆకస్మిక రాక ఆశ్చర్యం కలిగిస్తుంది. కోర్టు వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. పరిస్థితులు అనుకూలించడంతో మీలో మనోధైర్యం నెలకొంటుంది. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. మీ విలువైన వస్తువులు, పత్రాల విషయంలో జాగ్రత్త వహించండి. 
 
మిథునం : గృహ నిర్మాణాలు, మరమ్మతులు సంతృప్తికరంగా సాగుతాయి. రావలసిన ధనం వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కొంటారు. స్త్రీల సరదాలు, మనోవాంఛలు నెరవేరుతాయి. కొత్త ప్రదేశాల సందర్శన పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొంతమంది మీ ఆలోచనలను పక్కదారి పట్టించే ఆస్కారముంది. 
 
కర్కాటకం : మీ ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి, తగిన అవకాశం లభిస్తుంది. బంధువుల నుంచి ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు. ప్రముఖులతో పరిచయాలు మీ ఉన్నతిని పెంచుతాయి. ఉద్యోగస్తులకు పనిభారం, అధికారుల ఒత్తిడి తప్పదు. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. 
 
సింహం : ఉద్యోగస్తులకు అధికారులను మెప్పించడం చాలా కష్టం. ఓర్పు, రాజీ ధోరణితో కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. రుణాలు తీర్చడం, కొత్త రుణాలు అనుకూలిస్తాయి. స్త్రీలకు పట్టింపు మీద ధ్యాస మళ్లుతుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో శ్రమ, ప్రయాసలెదుర్కొంటారు. 
 
కన్య : ఉద్యోగస్తులకు రావలసిన అలవెన్సులు, క్లయింలు ఆలస్యంగా అందుతాయి. సొంత వ్యాపారాలు, దీర్ఘకాలిక పెట్టుబడులు ప్రస్తుతానికి వాయిదావేయటం శ్రేయస్కరం. దైవ దర్శనాలు సంతృప్తినిస్తాయి. స్త్రీలకు ఆడంబరాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. విద్యార్థులు తోటివారి వల్ల మాటపడక తప్పదు. 
 
తుల : విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి పెంపొందడంతో పాటు తోటి విద్యార్థులతో పోటీపడతారు. ప్రింటింగ్ రంగాల వారికి అరకొర పనులే లభిస్తాయి. ఉపాధ్యాయులు ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. మీ నిజాయితీకి మంచి గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఊహించని ఇబ్బందులెదురవుతాయి. 
 
వృశ్చికం : ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనగా భావించకండి. ఒక వ్యవహారం నిమిత్తం ప్రయాణం తలపెడతారు. ప్రముఖుల కలయిక వల్ల ఎంతో కొంత మేలు జరుగుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. చేస్తున్న పనులు పూర్తి అవుతున్న చివరి క్షణంలో విసుగు, భారమనివిస్తాయి. 
 
ధనస్సు : ట్రావెలింగ్ ఏజెన్సీలకు సామాన్యం. రేపటి గురించి ఆలోచనలు అధికమవుతాయి. దైవకార్యాలకు ధనం బాగా వ్యయం చేస్తారు. ఉద్యోగస్తుల సమర్థతను అధికారులు గుర్తిస్తారు. పత్రికా, వార్తా సంస్థలలోని వారికి ఊహించని చికాకులెదురవుతాయి. విద్యార్థులకు తోటివారితో క్రమేణా సత్సంబంధాలు నెలకొంటాయి. 
 
మకరం : వైద్య రంగం వారికి మంచి గుర్తింపు, ఆదాయం లభిస్తాయి. ప్రముఖ కంపెనీల షేర్ల నష్టాల బాటలో నడుస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. యోగా, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు అశాజనకం. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లు, ఫ్లీడరు గుమస్తాలకు చికాకులను ఎదుర్కొంటారు. 
 
కుంభం : మీరు అభిమానించే వ్యక్తుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఖర్చులు అధికమవుతాయి. ప్రతిఫలం తక్కువైనా వృత్తుల వారికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. ప్రింటింగ్ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. 
 
మీనం : స్త్రీలలో అసహనం, అశాంతి చోటుచేసుకుంటాయి. విద్యార్థులు పై చదువుల కోసం దూర ప్రదేశానికి వెళ్లవలసి వస్తుంది. కొన్ని విషయాల్లో కుటుంబంలో మీ ఆధిపత్యం చెల్లదు. ఏమరుపాటుగా వాహనం నడపడటం వల్ల ఊహించిని చికాకులు తలెత్తుతాయి. రావలసిన ధనం అందకపోవడంతో ఆందోళన చెందుతారు.