శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

11-09-2021 శనివారం దినఫలాలు - వెంకటేశ్వరుని ఆరాధించిన..

మేషం : ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యంతో మాటపడక తప్పదు. నూతన వ్యక్తుల పరిచయం మీకెంతో సంతృప్తినిస్తుంది. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. ఆలయ సందర్శనాల్లో ఇబ్బందులు తప్పవు. నిరుద్యోగులకు ఒక ప్రకటన ఎంతో ఆశ్చర్య కలిగిస్తుంది. 
 
వృషభం : భాగస్వామిక చర్చలలో మీ ప్రతిపాదనలకు గుర్తింపు, ఆమోదం లభిస్తాయి. మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయడం మంచిది. దైవ సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. ఒక స్థిరాస్తి విక్రయించాలనే ఆలోచన విరమించుకోవడం ఉత్తమం. మతిమరుపు కారణంగా ఇబ్బందులెదుర్కొంటాయి. 
 
మిథునం : కాంట్రాక్టర్లకు చేపట్టిన పనులు ఏమంత సంతృప్తి నివ్వజాలవు. విద్యార్థులు ఇతరుల వాహనం నడిపి ఇబ్బందులకు గురికాకండి. రాజకీయ నాయకులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. స్త్రీలకు అయినవారి ఆదరణ సహాయం లభిస్తాయి. ఖర్చులు మీ అంచనాలకు విరుద్ధంగా ఉంటాయి. 
 
కర్కాటకం : హోటల్, తినుబండ, క్యాటరింగ్ రంగాలలో వారికి పురోభివృద్ధి. కార్యసాధనలో పట్టుదల, ఓర్పు చాలా ముఖ్యమని గమనించండి. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం వల్ల జయం చేకూరుతోంది. కోర్టు వ్యవహారాలు వాయిదాపడటం ఒకందుకు మంచిదే. నూతన వ్యక్తుల విషయంలో మోసపోయే ఆస్కారం అవుతుంది. 
 
సింహం : ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన మిత్రుల సహకారం వల్ల సమసిపోగలవు. వృత్తి ఉద్యోగాల్లో ఆశాజనకమైన మార్పులుంటాయి. ఒక కార్యం నిమిత్తం ప్రయాణం చేపడుతారు. బిల్డర్లకు చికాకులు తప్పవు. దైనందిన కార్యక్రమాలలో మార్పులుండవు. తలపెట్టిన పనులలో విఘ్నాలు, చీటికి మాటికి అసహనం ఎదుర్కొంటారు. 
 
కన్య : కోళ్ళ మత్స్యు గొర్రెల వ్యాపారస్తులకు ఆందోళన అధికమవుతుంది. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగరీత్యా ప్రయాణాలు అనుకూలం. చేపట్టిన పనులు ఆకస్మికంగా వాయిదావేయవలసి వస్తుంది. కార్మికులు, తాపీ పనివారికి సంతృప్తికానరాదు. 
 
తుల : విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించుట వల్ల అస్వస్థతకు లోనవుతారు. స్త్రీలు అపోహల వల్ల మాటపడక తప్పదు. బ్యాటింగ్ ఫైనాన్స్, చిట్స్ ఫైనాన్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. ప్రైవేటు సంస్థలలోని వారికి నిర్లక్ష్యం, మతిమరుపు వల్ల యాజమాన్యం కోపతాపాలకు గురికావలసి వస్తుంది. 
 
వృశ్చికం : ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి సామాన్యం. విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. విలువైన వస్తువులు, పత్రాల విషయంలో మెళకువ వహించండి. బంధువులు, సోదరుల మధ్య సత్సంబందాలు నెలకొంటాయి. 
 
ధనస్సు : చిన్నతరహా పరిశ్రమలు, వృత్తుల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రైవేటు, పబ్లిక్ సంస్థల్లో వారికి ఊహించని మార్పులు సంభవిస్తాయి. మీ సన్నిహితుల వైఖరి వల్ల విభేదాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. అంతగా పరిచయం లేని వారికి ధనసహాయం చేసే విషయంలో అప్రమత్తత అవసరం. 
 
మకరం : ఎప్పటి నుంచో వాయిదాపడుతున్న సమస్యలు ఒక కొలిక్కి రాగలవు. ఉత్తర ప్రత్యుత్తరాలు, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. ప్రముఖులను కలుసుకుంటారు. రుణయత్నం వాయిదాపడతాయి. స్త్రీలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. 
 
కుంభం : తలపెట్టిన పనులలో విఘ్నాలు, చీటికి మాటికి అసహనం ఎదుర్కొంటారు. కళ, క్రీడా రంగాల వారికి మంచి గుర్తింపు, ఆదరణ లభిస్తాయి. ఉత్తర ప్రత్యుత్తరాలలో మెళకువ అవసరం. రాజకీయాల్లో వారికి విరోధుల విషయంలో అప్రమత్తత అవసరం. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. 
 
మీనం : దైవ, పుణ్య కార్యాలకు ధనం విరివిగా వ్యయమవుతుంది. రవాణా రంగాల వారు ఇబ్బందులను ఎదుర్కొంటారు. మిత్రులు కూడా మీకు దూరంగా ఉండటానికి యత్నిస్తారు. ఏదైనా స్థిరాస్తి కొనుగోలు లేక అభివృద్ధికి చేయాలనే దిశగా మీ ఆలోచనలు ఉంటాయి. పొదుపు విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.