శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

09-09-2021 గురువారం దినఫలాలు - సాయిబాబా గుడిలో అన్నదానం...

మేషం : ఆదాయానికి మించి ఖర్చులు అధికమవుతాయి. స్త్రీలకు కళ్లు తల, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. దూర ప్రయాణాలు వాయిదాపడతాయి. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. రాజకీయనాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. 
 
వృషభం : ఆర్థిక విషయంలో ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. తలపెట్టిన పనులు వాయిదావేస్తారు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు కలిసివస్తుంది. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధు మిత్రులను కలుసుకుంటారు. విద్యార్థులకు తోటివారితో సంభాషించునపుడు జాగ్రత్త అవసరం. 
 
మిథునం : పట్టువిడుపు ధోరణితోనే మీ సమస్యలను పరిష్కరించుకుంటారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారలలో మెళకువ అవసరం. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రముఖులను కలుసుకుంటారు. పెద్దమొత్తంలో రుణం ఇచ్చే విషయంలో జాగ్రత్త అవసరం. ప్రయాణాలలో నూతన పరచయాలు ఏర్పడతాయి. 
 
కర్కాటకం : ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. మీ జీవిత భాగస్వామి విషయంలో దాపరికం మంచిది కాదని గమనించండి. ఉద్యోగ యత్నంలో నిరుద్యోగులకు బిడియం, అభిమానం కూడదు. మీ మాటతీరు పద్ధతి ఎదుటివారిని ఆకట్టుకుంటారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది.
 
సింహం : ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికిని నెమ్మదిగా కుదుటపడతారు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. మనసులో ఆధ్యాత్మిక ధోరణి చోటుచేసుకుంటుంది. ముక్కుసూటి ధోరణి మంచిదికాదని గమనించండి. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. 
 
కన్య : ఆర్థికపరమైన లావాదేవీలు కలిసివస్తాయి. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. గృహ సంబంధ ఎలక్ట్రానిక్స్ వస్తువులను కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలపట్ల ఆసక్తి చూపుతారు. భూమి, స్థిరాస్తి యందు ఆసక్తి కలుగుతుంది. మీకుటుంబీకులతో ఏకీభించలేకపోతారు. మిత్రులను ఉల్లాసంగా గడుపుతారు. 
 
తుల : పట్టువిడుపు ధోరణితోనే మీ సమస్యలు పరిష్కారమవుతాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఇతరులకు పెద్ద మొత్తంలో రుణం ఇచ్చే విషయంలో పునరాలోచన చాలా అవసరం. వైద్యులు ఆపరేషన్లు చేయునపుడు జాగ్రత్త అవసరం. కొన్ని వ్యవహారాలు అనుకూలించినా మరికొన్ని ఆందోళన కలిగిస్తాయి. 
 
వృశ్చికం : ఏ వ్యక్తికి అతి చనువు ఇవ్వడం మంచిది కాదు. స్థిరాస్తి సంబంధ విషయాలు, ప్రస్తావనకు వస్తాయి. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. మీ శ్రీమతి సలహా పాటించండి చిన్నతనంగా భావించకండి. పెద్దల సలహాను పాటించి గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. 
 
ధనస్సు : ఆర్థిక విషయాలలో కొంత పురోభివృద్ధి కానవస్తుంది. వృత్తి, వ్యాపారాలకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం మంచిది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. మిత్రులను కలుసుకుంటారు. 
 
మకరం : ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే ఉంటుంది. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.
 
కుంభం : ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. భాగస్వామి తరపు బంధువుల రాకపోకలు ఉండగలవు. దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రముఖులను కలుసుకుంటారు. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి. 
 
మీనం : ఆధ్యాత్మిక ధోరణి చోటుచేసుకుంటుంది. అప్పుడప్పుడు మీ సంతానం వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. రేపటి సమస్య గురించి అధికంగా ఆలోచిస్తారు. కుటుంబ వ్యవహారాలు ఇతరులతో పంచుకొనుట మంచిది కాదు. స్త్రీలకు ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం కూడదు. మిత్రులను కలుసుకుంటారు.