గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

16-09-2021 గురువారం దినఫలాలు - వినాయకుడిని గరికెతో ఆరాధించినా...

మేషం : వృత్తుల్లో తోటివారితో అభిప్రాయభేదాలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు వహించండి. దైవ, సేవా కార్యక్రమాలకు ధనం అధికంగా వ్యయం చేస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు. దంపతుల మధ్య ప్రేమానుబంధం బలపడతుంది. పట్టువిడుపు ధోరణితో వ్యవహరించడం వల్ల కొన్ని పనులు మీకు సానుకూలంగా ఉంటాయి. 
 
వృషభం : కొన్ని వ్యవహారాలు అనుకూలించినా మరికొన్ని ఆందోళన కలిగిస్తాయి. రవాణా రంగంలోని వారికి చికాకులు తప్పదు. హోటల్, తినుబండారు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఒక విషయంలో మిత్రులపై ఉంచిన మీ నమ్మకం వమ్ము అయ్యే ఆస్కారం వుంది. బంధువులతో మీ సత్ సంబంధాలు బలపడతాయి. 
 
మిథునం : ముఖ్యులతో సంభాషించేటపుడు ఆచి, తూచి వ్యవహరించడం మంచిది. శత్రువులు, మిత్రులుగా మారి సహాయ సహకారాలు అధిస్తారు. దైవ, సేవ, పుణ్య కార్యాల్లో పాల్గొంటారు. ప్రేమికులకు సన్నిహితుల ప్రోత్సాహం లభిస్తుంది. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. 
 
కర్కాటకం : కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. నిరుద్యోగులకు ఇతరుల ఆంతరంగిక విషయాల్లో తలదూర్చడం వల్ల మాటపడతారు. మీరు చేపట్టిన పనికి ఇతరుల నుంచి అవాంతరాలు ఎదుర్కొంటారు. స్త్రీలు, టీవీ, చానల్స్ కార్యక్రమాలలో రాణిస్తారు. 
 
సింహం : ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ స్టేషనరీ వ్యాపారులకు అధిక శ్రమ తప్పదు. ఆలయ సందర్శనాలలో నూతన పరిచయాలేర్పడతాయి. రాజకీయాల్లో వారికి మతిమరుపు పెరగడం వల్ల ఆందోళనకు గురవుతారు. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. 
 
కన్య : వృత్తిపరమైన చికాకులు క్రమంగా తొలగిపోగలవు. నగదు చెల్లింపు చెక్కుల జారీ విషయంలో జాగ్రత్త వహించండి. రచయితలకు, పత్రికా రంగాల వారికి అనుకూలమైన కాలం. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. 
 
తుల : స్వతంత్ర వృత్తులలో వారికి జయం చేకూరును. ముక్కుసూటిగా పోయే మీ ధోరణి ఇబ్బందులకు దారితీస్తుంది. వార్తా సంస్థలలోని సిబ్బందికి మార్పులు అనుకూలిస్తాయి. మీ సంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. పరిచయాలు పెరుగుతాయి. రాజకీయాలలోని వారికి ప్రత్యర్థులు పెరుగుతున్నారని గమనించండి. 
 
వృశ్చికం : ప్రభుత్వ రంగాలలో వారికి సమస్యలు తలెత్తుతాయి. ఊహించని ఖర్చులు, చెల్లింపులు వల్ల స్వల్ప ఇబ్బందులు ఎదుర్కొంటారు. మిత్రుల కలయికతో సంతృప్తి కానవస్తుంది. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఒత్తిడి అధికమవుతుంది. సోదరీ, సోదరుల మధ్య కలహాలు తలెత్తుతాయి. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. 
 
ధనస్సు : ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. రావలసిన ధనం కొంత ముందు వెనుకలుగానైనా అందుతుంది. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. లీజు, ఏజెన్సీలు, కాంట్రాక్టుల విషయంలో పునరాలోచన మంచిది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. 
 
మకరం : బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. ఐరన్, కలప, సిమెంట్, వ్యాపారస్తులకు మందకొడిగా ఉండగలదు. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రిప్రజెంటివ్‌లకు సంతృప్తికానవస్తుంది. విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఓర్పు, నేర్పుతో అనుకున్నది సాధిస్తారు. 
 
కుంభం : ఉద్యోగస్తులు తోటివారి నుంచి ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు. నూనె, మిర్చి, కంది, స్టాకిస్టులకు వ్యాపారస్తులకు ఆశాజనకం. ఆదాయం బాగున్నా ఏదో తెలియని అసంతృప్తి, అసహనానికి లోనవుతారు. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. మీకు నచ్చని సంఘటనలు కొన్ని ఎదురుకావొచ్చు. 
 
మీనం : దైవ, సాంఘీక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత ఎంతో ముఖ్యం. వైద్యులకు ఆపరేషన్లు చేయునపుడు మెళకువ అవసరం. రావలసిన ధనం వసూలు విషయంలో ఓర్పు, లౌక్యం ఎంతో అవసరం. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది.