బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 2 అక్టోబరు 2021 (16:58 IST)

అక్టోబర్ 8న విడుదలవుతున్న ఆరడుగుల బుల్లెట్

Gopichand, Nayantara
గోపీచంద్ హీరోగా యాక్షన్ ఎంటర్టైనర్ జానర్‌లో `ఆరడుగుల బుల్లెట్` సినిమా తెరకెక్కింది. గోపీచంద్ సరసన నయనతార  హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి మాస్ డైరెక్టర్ బి. గోపాల్ దర్శకత్వం వ్యవహరించారు. జయ బాలాజీ రియల్ మీడియా బ్యానర్ మీద తాండ్ర రమేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
 
మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 8న విడుదల చేయబోతోన్నట్టు పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రకాష్ రాజ్, అభిమన్యు సింగ్, కోట శ్రీనివాస రావు, బ్రహ్మానందం, జయ ప్రకాష్ రెడ్డి, చలపతి రావు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
 
ఈ చిత్రానికి మెలోడీబ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందించారు. బాల మురుగన్ కెమెరామెన్‌గా, కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. వక్కంతం వంశీ కథ అందించగా.. అబ్బూరి రవి డైలాగ్స్ రాశారు.
సాంకేతిక బృందంః 
దర్శకుడు : బి. గోపాల్, నిర్మాత : తండ్ర రమేష్, కథ, కథనం : వక్కంతం వంశీ, సంగీతం : మణిశర్మ, సినిమాటోగ్రఫీ : బాల మురుగన్, ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వర రావు.