శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : గురువారం, 7 అక్టోబరు 2021 (18:06 IST)

నో కామెంట్ అంటోన్న చీర క‌ట్టిన‌ జబర్దస్త్ అందం

Anasuya Bhardwaj
అనసూయ భరద్వాజ్ ఆమ‌ధ్య త‌న దుస్తుల‌పై జబర్దస్త్ ప్రోగ్రామ్‌లో ఓ వ్య‌క్తి వేసిన ప్ర‌శ్న‌కు కాస్త కినుక వ‌హించింది. అయినా కాసేపు తేరుకుని మా ఆయ‌న‌కు ఇబ్బందిలేనిది నీకెందుకు అన్న‌ట్లు ఆ వ్య‌క్తిని ప్ర‌శ్నించింది. స‌రే.. ఇదంతా ఆమె అందంపై అసూయ‌తో కొందరు ఇలాగే అంటుంటార‌ని తోటి జబర్దస్త్ న‌టుడు ఆమెను కూల్‌చేశాడ‌నుకోండి. ప్ర‌తి వారం వ‌చ్చే జబర్దస్త్ ప్రోగ్రామ్‌లో త‌న వ‌చ్చే గెట‌ప్‌ను త‌న సోష‌ల్‌మీడియాలో పెడుతుంటుంది. ఈరోజు ఇలాగే పోస్ట్ చేసింది. చీర డ్రెస్‌లో త‌ను బాగా ఆక‌ట్టుకుంటోంది.
 
ఇదిలా వుంటే, ఇటీవ‌లే ఓ చోట అన‌సూయ‌ను పలుక‌రిస్తే కొత్త సినిమాలు చెప్పింది. జయశంకర్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున‌న‌ట్లు తెలిపింది. అయితే ఆమె `మా`లో మెంబ‌ర్ కూడా. ప్ర‌కాష్‌రాజ్ పేన‌ల్‌లో ఆమె నిల‌బ‌డింది. అస‌లు `మా` ఎన్నిక‌ల గొడ‌వేమిటి? ఇంత అవ‌స‌ర‌మా? అనే ప్ర‌శ్న‌కు కాసేపు గుంభ‌నంగా మారిపోయింది. దీనిపై నో కామెంట్ అంటూ వెళ్ళిపోయింది. ఇక ప్ర‌కాష్‌రాజ్‌, విష్ణు ఎవ‌రు గెలుస్తార‌నేదానికంటే వారి వారి పేన‌ల్‌లో వున్న స‌భ్యుల‌కు ఎన్ని ఓట్లు వ‌స్తాయ‌నేది చూడాల్సిందే.