బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : గురువారం, 7 అక్టోబరు 2021 (17:45 IST)

క‌వ్వించే లుక్స్‌తో రుహాని శ‌ర్మ‌, న‌భా న‌టేష్

NabhaNatesh photo shoot
`నూటొక్క జిల్లాల అంద‌గాడు` క‌థానాయిక రుహాని శ‌ర్మ‌కు సంబంధించిన ఫొటోలు షూట్‌ను సోష‌ల్ మీడియాలో పంచుకుంది. లేత నీలిరంగులో వున్న కుర‌చ దుస్తుల‌తో అందాల‌ను ఆర‌బోసిన‌ట్లుగా వున్నాయి. `నూటొక్క జిల్లాల అంద‌గాడు` సినిమాలో సంప్ర‌దాయ‌మైన యువ‌తిగా న‌టించిన రుహాని రాబోయే సినిమాలో కాస్త గ్లామ‌ర్ పాత్ర‌ను పోషిస్తోంది.
 
RuhaniSharma looks
ఇక న‌భా న‌టేష్ పిచ్చెక్కించే లుక్స్‌తో అద‌ర‌గొడుతోంది. ఎప్పటికప్పుడూ ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ `ఇస్మార్ట్ శంక‌ర్‌తో మైలేజ్ తెచ్చుకుంది. అలా మాస్‌లో తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ పోతోన్న క‌న్న‌డ బ్యూటీ. ఓవైపు తన మాటలతోనే కాకుండా అందచందాలతో కూడా ప్రేక్షకులను అలరిస్తూంది. ఓ కొత్త సినిమా కోసం తీసి ఫొటో షూట్ తో ఇలా కైపు క‌లిగించే చూపుతో క‌వ్విస్తుంది. త్వ‌ర‌లో ఆ వివ‌రాలు తెలియ‌జేయ‌నుంది.