బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 అక్టోబరు 2021 (14:04 IST)

సనత్ నగర్‌లో వ్యభిచారం - ఆరుగురు అమ్మాయిల అరెస్టు

హైదరాబాద్ నగరంలోని సనత్ నగర్ ఏరియాలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతూ వచ్చిన వ్యభిచారం గుట్టును పోలీసులు రట్టు చేశారు. సనత్‌ నగర్‌లో విదేశీ మహిళలతో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. 
 
వారితోపాటు బంగ్లాదేశ్‌కు చెందిన ఐదుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకులపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. బంగ్లాదేశ్‌ నుంచి మహిళలను రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు.