మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 9 జులై 2021 (16:56 IST)

అన‌సూయ అందాల‌కు చెక్ ప‌డిన‌ట్లేనా!

Anasuya
యాంక‌ర్‌, న‌టి అయిన అన‌సూయ భ‌రద్వాజ్ మ‌హిళ‌లు అన్నిరంగాల్లో ముందుండాల‌ని అంటోంది. ఇటీవ‌లే అంత‌రిక్షంలో ప్ర‌వేశిస్తున్న తెలుగు మ‌హిళ శిరీష‌కు శుభాకాంక్ష‌లు తెలిపింది. అయితే ఇంత‌కుముందు వున్న అన‌సూయ‌కు ఇప్పుడున్న అన‌సూయ‌కు కొంత వ్య‌త్యాసం క‌నిపిస్తోంది. న‌టిగా రంగ‌మ్మ‌త్త‌గా న‌టిస్తూ, ఐటంసాంగ్‌లు కూడా చేసిన అన‌సూయ టీవీ షోలో మాత్రం రెచ్చిపోయి త‌న అందాల‌ను క‌నిపించేట్లుగా చేసేది. దానిమీద చాలాచోట్ల చ‌ర్చ జ‌ర‌గ‌డంతో నా ఇష్టం నేను తీసేది తీస్తాను. మీరు చూస్తే చూడండి లేదంటే లేదు.. అన్న రామ్‌గోపాల్ వ‌ర్మ బాట‌లో స్టేట్‌మెంట్ ఇచ్చేది.
 
ఇది గ్ర‌హించిన జ‌బ‌ర్‌ద‌స్త్‌లోని ఓ ఆర్టిస్టు ఆమ‌ధ్య ఆమె పాల్గొన్న షోలో శివ అనే యూట్యూబ్‌కు చెందిన వ్య‌క్తిని తీసుకువ‌చ్చాడు. ఆ స‌మ‌యంలో అన‌సూయ వేసుకున్న డ్రెస్ గురించి ప్ర‌శ్నించాడు. ఇది నా ఇష్టం అంటూ తేల్చిచెప్పింది. ఆ వెంట‌నే మీ ఇష్టం అయితే మీ ఇంట్లో వేసుకోండి. ఇలా ఇది ప‌దిమంది చూసే చోట కాదంటూ గట్టిగానే చెప్పాడు.  దాంతో ఫీల‌యి శివ అనే వ్య‌క్తిని తిట్టుకుంటూ అత‌న్ని తీసుకువ‌చ్చిన టీమ్ లీడ‌ర్‌కు వార్నింగ్ ఇస్తూ అలిగి బ‌య‌ట‌కు వెళ్ళిపోయింది. ఆ బ‌య‌ట‌కు వెళ్ళాక ప్ర‌శ్న అడిగిన శివ సారీ! అని చెప్పాడు. అస‌లు ఇత‌ను ఇలా అడుగుతాడ‌ని నాకు ముందుగా చెప్ప‌లేద‌ని టీమ్ లీడ‌ర్ అన‌సూయ‌తో అన్నాడు. ఆ త‌ర్వాత కాసేప‌టికి బాగా ఆలోచించి, ఒక్క‌సారిగా న‌వ్వింది. ఆ త‌ర్వాత ముగ్గురూ స్టేజీమీద‌కు వ‌చ్చి, ష‌డెన్‌గా వాన వ‌చ్చి వెలిసిపోయింది అన్న‌ట్లుగా బిహేవ్ చేశారు.
 
సో. ఆ ఘ‌ట‌న త‌ర్వాత 35 సంవ‌త్స‌రాల అన‌సూయ రూటు మార్చింది. అప్ప‌టినుంచి ఆమె పూర్తిగా దుస్తుల‌ను వేసుకునే షోలో పాల్గొంటుంది. మ‌రి షోలో ఆరోజు ఎందుకు అంత‌లా కోప‌డ్డార‌ని ఓ విలేక‌రి ఇటీవ‌లే ఆమెను క‌లిసిన‌ప్పుడు అడిగాడు. తెలీకుండా అలా జ‌రిగిపోయింది. అదో ఫ‌న్ అంటూ చెప్పింది. మ‌రి అంత స‌ర‌దాగా చేయ‌డానికి షో నిర్వాహ‌కులు ఆమెకు చుట్టాలుకాదుగ‌దా. ఏదిఏమైనా కుటుంబంతో క‌లిసి చూసే ఈ షోకు ఇలా ఎక్స్ పోజింగ్ చేయ‌డం అవ‌స‌ర‌మా? అనేది బ‌య‌ట బాగా పాపుర‌ల్ కావ‌డంతో ఒక ప్లాన్ ప్ర‌కార‌మే నిర్వాహ‌కులు అలా ఆమెకు జ‌ర్క్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం.