మంగళవారం, 21 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : గురువారం, 6 జనవరి 2022 (19:02 IST)

అనసూయ అందాలు ప‌క్క రాష్ట్రాల‌కు పాకింది!

Anasuya Bhardwaj
అనసూయ భరద్వాజ్ తెలుగులో అందాల యాంకర్‌. టీవీ షోల‌లో రోజుకొక వెరైటీ గెట‌ప్‌ల‌తో యూత్‌ను ఆక‌ట్టుకుంటుంది. జ‌బర్ ద‌స్త్ ప్రోగ్రామ్‌తో విదేశాల్లో సైతం ఆమెకు ఫ్యాన్స్ వున్నారు. ఆమ‌ధ్య దుబాయ్‌లో జ‌రిగిన ఓ ఈవెంట్‌ను ఈమెను ప్ర‌త్యేకంగా నిర్వాహ‌కులు తీసుకెళ్ళారు. ఇదిలా వుంటే అనసూయ అందాలు ప‌క్క రాష్ట్రాల‌కు పాకింది. 
 
Anasuya Bhardwaj
హాట్ యాంక‌ర్‌గా ఆమెకు పేరు వ‌చ్చేసింది. రంగ‌మ్మ‌త్త‌గా సుకుమార్ సినిమాలో సెక్సీగా న‌టించిన ఆమె తాజాగా పుష్ప‌లో త‌మిళ ఫ్లేవ‌ర్ లేడీ విల‌న్‌గా న‌టించింది. దాంతో ఆమెకు ఆప‌ర్లు వ‌స్తున్నాయ‌ట‌. ఇప్ప‌టికే  అనసూయకు మలయాళంలో ఓ సినిమా అవకాశం వచ్చింది. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి చిత్రం ‘భీష్మ పర్వం’లో పోలీస్ పాత్రలో నటిస్తోంది. తాజాగా అందులో అనసూయకు సంబంధించిన లుక్‌ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. కళ్లద్దాలతో క్యూట్ లుక్స్‌తో ఉన్న అనసూయను అభిమానులు మురిసిపోతన్నారు.  
 
ఇక మెగాస్టార్  హీరోగా నటిస్తోన్న ‘గాడ్‌ఫాదర్’ సినిమాలో ఓ కీలక పాత్రలో న‌టిస్తున్న‌ట్లు తెలుస్తోంది.