1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 28 జనవరి 2022 (08:34 IST)

వయసు పెరుగుతున్న తరగని అనసూయ అందం

బుల్లితెరపై ప్రసారమయ్యే కామెడీ షో 'జబర్దస్త్' యాంకర్ అనసూయ భరద్వాజ్ ఇపుడు "పుష్ప" చిత్ర విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె ద్రాక్షాయణి పాత్రను పోషించారు. ఈ చిత్రంలో విలన్‌ మంగళం సీనుకు భార్యగా నటించారు. 
 
ఇకపోతే, "పుష్ప-2"లో ఆమె ఫుల్ లెంగ్త్ కామెడీ సీన్‌ను చేయబోతున్నారు. దీంతో ప్రేక్షకులను మరింతగా ఆలరిస్తారని భావిస్తున్నారు. అయితే, ఈమెకు వయసు మీదపడుతున్నప్పటికీ అందం మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు కదా మరింత రెట్టింపు అవుతుంది. 
 
గతంలో "రంగస్థలం" చిత్రంలో రంగమ్మత్తగా నటించిన అనసూయ.. ఇపుడు 'పుష్ప'లో ద్రాక్షాయణి పాత్రలో నటించారు. అయితే, తన అందానికి రోజురోజుకూ మరింతగా మెరుగులు దిద్దుకుంటూ ముందుకుసాగుతున్నారు. 
 
ముఖ్యంగా, తన అందంతో కుర్రకారుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. అపుడపుడూ ప్రత్యేక ఫోటో షూట్‌లు చేస్తూ, వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజన్లను ఫిదా చేస్తున్నారు.