శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 డిశెంబరు 2021 (19:57 IST)

పుష్ప సినిమా సక్సెస్ పార్టీ: సెకండ్ పార్ట్‌ మరో లెవల్లో వుంటుంది

పుష్ప సినిమా సక్సెస్ పార్టీ జరుపుకుంది. కలెక్షన్స్ పరంగా కూడా బాగానే వసూళ్లు రాబట్టింది. ప్రేక్షకుల అంచనాలకు అనుగుణంగా ఈ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేశారు. ప్రస్తుతం పార్ట్ 1 మాత్రమే విడుదల చేశారు. పార్ట్ 2 తర్వాత రిలీజ్ చేయనున్నారు. ఇలా పార్ట్ 1 సక్సెస్ సాధించిన సందర్భంగా ‘పుష్ప’ డైరెక్టర్ సుకుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ సక్సెస్ మీట్‌లో సుకుమార్ ఈ విషయాలపై మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
 
పుష్ప అసలు కథ పార్ట్-2లోనే ఉంది. పార్ట్-1 అసలు కథకి ఒక లీడ్ మాత్రమే. పార్ట్ 2 మరో లెవల్లో ఉంటుందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పుష్ప పార్ట్-1లో వున్న అన్నీ పాత్రలు పార్ట్-2లో మరో రేంజ్‌లో వుంటాయని చెప్పుకొచ్చారు.
 
అంతేగాకుండా.. పుష్ప సెకండ్ పార్ట్‌లో మరో మూడు పాత్రల్ని కూడా అదనంగా యాడ్ చేస్తున్నామని చెప్పారు. పార్ట్-2లో ఫహద్ ఫాజిల్ పూర్తి స్థాయి పెర్ఫార్మెన్స్ ఉంటుందని, అనసూయకి కూడా సెకండ్ పార్ట్‌లో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని సుకుమార్ వివరించారు.