శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 డిశెంబరు 2021 (16:41 IST)

ఐటమ్ సాంగ్ చేసినందుకు థ్రిల్లింగ్‌గా ఉంది.. ఇది ఓ మ్యాడ్‌నెస్ : సమంత

అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు కె.సుకుమార్ తెరకెక్కించిన చిత్రం "పుష్ప". ఈ నెల 17వ తేదీన పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైంది. అయితే, ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ సమంత ఓ ఐటమ్ సాంగ్‌లో నర్తించారు. ఈ పాటకు అద్భుతమైన స్పందనతో పాటు విమర్శలు కూడా వస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో సమంత ఈ పాటపై స్పందించారు. ఈ పాటకు వస్తున్న స్పందన పట్ల చాలా థ్రిల్లింగ్‌గా వుంది. ఇది ఓ మ్యాడ్‌నెస్ అని తెలిపింది. అలాగే, తన ట్విటర్ ఖాతాలో ఈ పాటపై వస్తున్న ఫన్నీ పాటలను కూడా ఆమె షేర్ చేశారు.
 
పరీక్షలో అడిగిన ప్రశ్నలకు సమాధానాలు రాయకుండా "ఊ అంటావా.. ఊహూ అంటావా మావా" అనే పాట రాస్తానేమోనని భయంగా ఉందంటూ ఓ విద్యార్థి అంటున్నట్లు ఆ వీడియోలో వుండటం గమనార్హం. 
 
అంతేకాకుండా, ఈ సినిమాలో తాను భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రత్యేక సాంగ్ తనకు ఓ సవాలుగా అనిపించిందని చెప్పారు. ఆ పాటలో అల్లు అర్జున్‌కు సమానంగా స్టెప్పులు వేయడం చాలా ఉత్సాహంగా అనిపించిందని సమంత వివరించారు.