శుక్రవారం, 22 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 మార్చి 2022 (10:13 IST)

వివాదంలో రాజమౌళి "ఆర్ఆర్ఆర్" - చిక్కులు తప్పవా?

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన చిత్రం "ఆర్ఆర్ఆర్". ఈ చిత్రం ఈ నెల 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ అవుతుంది. అయితే, ఈ చిత్రం విడుదల తేదీ సమీపిస్తున్న తరుణంలో ఓ కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఇందులో కొమరం భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్‌లు నటించారు. అయితే, ఈ చిత్రంలో ఇద్దరు మహావీరుల చరిత్రను వక్రీకరించారంటూ సీపీఐ నేత రామకృష్ణ ఆరోపింస్తున్నారు. 
 
అల్లూరి సీతారామరాజు పాత్రను డిజైన్ చేసిన విధానంలో తప్పులు దొర్లాయని ఆయన అంటున్నారు. నిజ జీవితంలో బ్రిటీష్ వారితో పోరాడిన అల్లూరిని, వారితో కలిసి పని చేసే పోలీస్ అధికారి పాత్రలో మేకర్స్ ఎలా చూపిస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు. మాతృభాష కోసం ప్రాణత్యాగం చేసిన నిజమైన దేశభక్తుడు అల్లూరి సీతారామరాజు అని, కానీ ఈ చిత్రంలో మేకర్ మరోలా చూపించారని ఆయన అంటున్నారు.