శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 8 మార్చి 2022 (11:10 IST)

నా భార్య వ‌ల్లే హీరోగా స‌క్సెస్ అయ్యాను - మెగాస్టార్ చిరంజీవి

Chiranjeevi, Surekha, Anjanadevi
మెగాస్టార్ చిరంజీవి త‌న భార్య సురేఖ గురించి ర‌హ‌స్యాన్ని వెల్ల‌డించారు. మంగ‌ళ‌వారంనాడు అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా ఆయ‌న సినిమా రంగంలోని మ‌హిళా క‌ళాకారుల‌ను స‌న్మానించే కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొన్నారు.


ఈ సంద‌ర్భంగా ఆయ‌న మ‌హిళ‌ల‌నుద్దేశించి మాట్లాడుతూ, మ‌గ‌వాని జీవితంలో స్త్రీ పాత్ర ఎంతో వుంటుంది. ఆమె స‌పోర్ట్ లేకుండా ఏ భ‌ర్త విజ‌యాలు సాధించ‌లేడు. నేను హీరోగా నిల‌దొక్కుకోవ‌డానికి స‌క్సెస్ కావడానికి కార‌ణం మా భార్య‌నే. ఆమె ఎన్నో క‌ష్టాలు ప‌డి పిల్ల‌ల‌ను పోషించి చ‌క్క‌టి మార్గంలో తీర్చిదిద్దింది. నేను షూటింగ్ స‌మ‌యంలో స‌మ‌య‌పాల‌ను పాటించడానికి కార‌ణం కూడా ఆమె ప్రోత్సాహ‌మే అని పేర్కొన్నారు.

 
మ‌హిళ‌లు అన్ని రంగాల్లో విజ‌యాన్ని సాధిస్తున్నారు. ఆ విష‌యాలు తెలిసిన‌ప్పుడు నాకు చాలా గ‌ర్వంగా అనిపిస్తుంది. సాధార‌ణ స్థాయి నుంచి అంత‌రిక్షం వైపు దూసుకు వెళ్ళేలా మ‌హిళ‌లు ముంద‌డుగు వేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌తి మ‌హిళ‌కు మ‌హిళా దినోత్స‌వం శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తుంది. నా సినిమా క‌థ‌ల ఎంపిక‌ల‌లో ఒక్కోసారి భార్య‌ను కూడా స‌ల‌హాలు అడుగుతాన‌ని తెలిపారు. చిన్న‌త‌నం నుంచి మా అమ్మ న‌న్ను స‌రైన మార్గంలో తీర్చ‌దిద్దింద‌ని అన్నారు.