1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 8 జులై 2025 (19:01 IST)

Chandra Naidu: ఢిల్లీలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన

Chandra babu
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జూలై 14 నుండి జూలై 16 వరకు మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అంశాలపై చర్చించడానికి పలువురు కేంద్ర మంత్రులను కలవడానికి ఢిల్లీకి వెళతారు. తాత్కాలిక షెడ్యూల్ ప్రకారం, ముఖ్యమంత్రి సోమవారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్‌తో పాటు ఇతర మంత్రులను కలవనున్నారు. ఈ సందర్భంగా బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతి నిరాకరణ నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. 
 
ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీలో పర్యటిస్తున్నారు. తెలంగాణలో  కొత్త రేషన్ కార్డుల పంపిణీని సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ఈ నెల 14న బహిరంగ సభలో నిర్వహించబోతోంది. ఈ సభకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ఆహ్వానించే యోచనలో సీఎం రేవంత్ ఉన్నారు. వీటితో పాటు నామినేటెడ్ పోస్టులు, పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలపై కూడా కాంగ్రెస్ అధిష్ఠానంతో ముఖ్యమంత్రి చర్చించనున్నారని సమాచారం.