ఇద్దరు కుమార్తెలను బావిలోకి విసిరేసి ఆత్మహత్య చేసుకున్న మహిళ
తెలంగాణలో ఓ మహిళ తన పిల్లలను బావిలో పడేసింది. ఆపై తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన తెలంగాణ మహబూబ్ నగర్ జిల్లాలోని భూత్పూర్, యెల్కిచర్ల గ్రామంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. జంగమ్మ (42) తన ఇద్దరు కుమార్తెలు, కొడుకుతో కలిసి వ్యవసాయ పొలంలోని బావి దగ్గరకు వచ్చింది. ఆమె 15 ఏళ్ల జ్యోతి, 13 ఏళ్ల శైలజలను బావిలోకి విసిరి, ఆ తర్వాత తాను ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి బావిలోకి విసిరేలోపే తప్పించుకున్న ఆమె కుమారుడు గ్రామస్తులకు సమాచారం అందించాడు.
పోలీసులు మృతదేహాలను బావి నుండి తీసి పోస్టుమార్టం కోసం తరలించారు. కుటుంబ కలహాల కారణంగా ఆ మహిళ ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ ఘటన రాష్ట్రంలో జరగడం మూడోసారి.
మార్చి 2న యాదాద్రిలో, ఒక మహిళ తన ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకుంది. మార్చి 6న జరిగిన మరో సంఘటనలో, కామారెడ్డి జిల్లాలో ఒక ఆటోరిక్షా డ్రైవర్ తన ముగ్గురు మైనర్ కుమార్తెలను సరస్సులో ముంచి చంపిన ఘటన రాష్ట్రంలో కలకలం రేపిన సంగతి తెలిసిందే.