అమెరికాలో స్పైడర్ మేన్ నో వేను క్రాస్ చేసిన ఆర్.ఆర్.ఆర్.
రాజమౌళి సినిమాలంటే బాహుబలినుంచి ఓవర్‌సీస్ మార్కెట్ బాగా పెరిగింది. తాజాగా ఆర్.ఆర్.ఆర్. (రౌద్రం రణం రుధిరం) సినిమా అమెరికాలో 12 సెంటర్లలో విడుదలకాబోతుంది. ప్రీమియర్‌కు అత్యధిక వసూలు చేస్తున్న సినిమాగా అక్కడ పంపిణీదారులు తెలియజేస్తున్నారు. దీనిపై రాజమౌళి, ఎన్.టి.ఆర్., రామ్‌చరణ్‌లు చాలా హ్యాపీగా వున్నారు.
ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ, స్పైడర్ మేన్ నో హోమ్ నుంచి మించి వసూలు చేస్తుందని డిస్ట్రిబ్యూటర్లు చెప్పడం చాలా ఆనందంగా వుంది. నార్త్ అమెరికాలోని ఓ ప్రాంతంలో స్పైడర్ మేన్ నో సినిమాను బీట్ చేసిందని తెలియడం చాలా ఆనందంగా వుంది. నేను సహజంగా సినిమా తీసి దాని గురించి పెద్దగా ఆలోచించను. కానీ రిలీజ్ అయ్యాక ఆ రికార్డులు ఎంతవరకు వచ్చాయనేది పంపిణీదారులు చెబితేనే వింటాను అని తెలిపారు.
రామ్‌చరణ్ మాట్లాడుతూ, తెలుగు ప్రేక్షకులు ఓవర్‌సీస్‌లో మా సినిమాను చూసేందుకు ఇంతటి ఆసక్తి చూడడం చెప్పలేని ఆనందాన్నిచ్చిందని పేర్కొన్నారు.