ఏపీ సీఎం జగన్‌కు నాంపల్లి కోర్టు సమన్లు
ఏపీ సీఎం జగన్‌కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. 2014లో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ...జగన్, శ్రీకాంత్‌రెడ్డి, నాగిరెడ్డిపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో సోమవారం విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. మొదటి సారి సీఎం స్థాయి వ్యక్తికి నాంపల్లి ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. దీంతో ఏపీ సీఎం జగన్‌కు నాంపల్లి కోర్టు షాకిచ్చినట్లైంది.
నాంపల్లి కోర్టు అనగానే.. అక్రమాస్తులు, సీబీఐ, ఈడీ కేసులు అనుకునేరు. ఇది వేరే కేసు. 2014 హుజూర్‌నగర్ ఎన్నికల్లో ఎలక్షన్ కోడ్ ఉల్లఘించారని జగన్‌పై గతంలో కేసు నమోదయ్యింది. ఆ కేసు విచారణలో భాగంగా తాజాగా నాంపల్లి కోర్టు సమన్లు ఇష్యూ చేసింది.
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై.. జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిలపైన కూడా కేసులు నమోదయ్యాయి. ఆ కేసు విచారణలో భాగంగా నాంపల్లి కోర్టుకు విజయమ్మ, షర్మిలలు పలుమార్లు హాజరు అయ్యారు. లేటెస్ట్‌గా సీఎం జగన్‌కు సమన్లు జారీ చేసింది నాంపల్లి కోర్టు.