శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 మార్చి 2022 (13:33 IST)

ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్

ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. భారీగా గ్రూప్ ఉద్యోగాల భర్తీకి ఏపీ సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.  సీఎం ఆదేశాల మేరకు 110 గ్రూప్ 1 పోస్టులు, 182 గ్రూప్ 2 ఖాళీల భర్తీకి త్వరలో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 
 
గ్రూప్ 2 కు సంబంధించి మొత్తం 182 ఖాళీలకు‌గాను నోటిఫికేషన్ విడుదల కానుంది. అయితే గతేడాది విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం గ్రూప్1, గ్రూప్ 2 మొత్తం ఖాళీలు కేవలం 36 మాత్రమే ఉన్నట్లు అధికారులు ప్రకటన విడుదల చేశారు.
 
అయితే గతేడాది విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం గ్రూప్1, గ్రూప్ 2 మొత్తం ఖాళీలు కేవలం 36 మాత్రమే ఉన్నట్లు అధికారులు ప్రకటన విడుదల చేశారు.
 
ఇదిలా ఉంటే.. మార్చి 2022 వరకు నెలల వారీగా భర్తీ చేయనున్న ఖాళీల వివరాలతో గతేడాది ఏపీలోని జగన్ ప్రభుత్వం జ్యాబ్ క్యాలెండర్ విడుదల చేసింది.
 
అయితే.. ఈ జాబ్ క్యాలెండర్ ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ మొదటి వారంలోగా మరో జాబ్ క్యాలెండర్ విడుదలయ్యే అవకాశం ఉంది. 
 
అయితే. గతేడాది జాబ్ క్యాలెండర్ లో పోస్టుల సంఖ్య కేవలం 10 వేలు మాత్రమే ఉండడంతో నిరుద్యోగులు, ప్రతిపక్షాల నుంచి ప్రభుత్వంపై భారీగా విమర్శలు వచ్చాయి. దీంతో ఈ సారి జాబ్ క్యాలెండర్ లో ఖాళీల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉండనున్నట్లు తెలుస్తోంది.