శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 24 మార్చి 2022 (12:57 IST)

ఆరుగురు టీడీపీ ఎమ్మెల్సీలను సస్పెండ్ చేసిన ఏపీ మండలి

ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి ఆరుగురు టీడీపీ ఎమ్మెల్సీలను సస్పెండ్ చేసింది. సారా మరణాలు సహజం కావని, అవి ప్రభుత్వ హత్యలేనని మండలిలో నినాదాలు చేశారు. మద్యనిషేదంపై చర్చ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. 
 
అలాగే ఆంధ్రప్రదేశ్‌లో సారా మరణాలు, జే మద్యాన్ని నిలుపుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ మండలి చైర్మన్‌ పోడియంను చుట్టు ముట్టిన ఆరుగురు టీడీపీ ఎమ్మెల్సీలను మండలి చైర్మన్‌ మోసెస్‌ రాజు సస్పెన్షన్ చేశారు. 
 
సభా కార్యక్రమాలకు టీడీపీ సభ్యులు అడ్డుపడుతున్న దృష్ట్యా ఎమ్మెల్సీలు రామ్మోహన్‌, దువ్వాల రామారావు, రవీంద్రనాథ్‌రెడ్డి, బచ్చుల అర్జునుడు, పరుచూరి అశోక్‌బాబు, దీపక్‌రెడ్డిలను ఒకరోజు సస్పెన్షన్‌ చేయాలని మంత్రి అప్పలరాజు మండలి చైర్మన్‌ను కోరారు.
 
దీంతో ఎమ్మెల్సీలను ఒక రోజు సస్పెన్షన్‌ చేస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్‌ తెలిపారు.