ఇంటి పన్ను కట్టకకపోతే తాళం వేయడంలో తప్పేముంది?
ఇంటిపన్ను వసూలులో పిఠాపురం మున్సిపాలిటీ అధికారులు వ్యవహారించిన తీరును ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సమర్థించారు. ఆస్తి పన్ను చెల్లించని ఇళ్ళను జప్తు చేయడంలో తప్పేముందనని ఆయన ప్రశ్నించారు.
కాగా, ఏపీలోని వైకాపా ప్రభుత్వం పన్ను చెల్లించని వారిపై ఉక్కుపాదం మోపుతోంది. ఆస్తి పన్ను కట్టకపోతే ఆస్తులు జప్తు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు, చెత్తపన్ను కట్టలేదనే కారణంతో దుకాణాల ముందు చెత్త వేసిన ఘటన విమర్శల పాలైన విషయం తెల్సిందే. ఇపుడు పిఠాపురంలో ఇంటిపన్ను చెల్లించలేదన్న కారణంగా ఇంట్లో ఆడవాళ్లు ఉండగానే మున్సిపల్ అధికారులు ఇంటికి తాళం వేశారు. అధికారుల చర్యపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
దీనిపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. కరెంట్ బిల్లు చెల్లించకపోతే కరెంట్ తీసేస్తామని చెప్పడంలో తప్పేముందన్నారు. ఆస్తుల జప్పు అనేది ఇపుడు కొత్తగా రాలేదన్నారు. పన్నులు కట్టకపోతే ఆస్తులు జప్తు చేస్తామని చెప్పడాన్ని తప్పు అంటే ఎలా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వాలు చేసినపుడు ఈ విధానాన్ని ఎందుకు ప్రశ్నించలేదని ఆయన మండిపడ్డారు. పన్నులు చెల్లించకుంటే స్థానిక సంస్థలు ఎలా నడుస్తాయని ఆయన ప్రశ్నించారు.