శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

ఆసాని తుఫాను ఎఫెక్టు : నేటి నుంచి 3 రోజుల పాటు ఏపీ, తెలంగాణాల్లో వర్షాలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త సోమవారానికి తుఫానుగా మారనుంది. ప్రస్తుతం ఇది అండమాన్ సముద్ర తీరానికి దక్షిణ దిశగా ఉంది. అండమాన్ అండ్ నికోబార్ దీవుల వెంట ఉత్తర దిక్కులో కదులుతోందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది ఈ నెల 21వ తేదీ నాటికి తుఫానుగా మారుతుందని, దీనికి అసానీ అనే పేరు పెట్టినట్టు ఐఎండీ వెల్లడించింది. 
 
కాగా, ఆదివారం ఉదయానికి పోర్ట్ బ్లెయిర్‌కు ఆగ్నేయంగా 200 కిలోమీటర్ల దూరంలో ఈ అల్పపీడనం నెలకొనివుంది. మార్చి 22వ తేదీ నాటికి బంగ్లాదేశ్, మయన్మార్ తీరాలకు తాకొచ్చని ఐఎండీ తెలిపింది. దీనివల్ల అండమాన్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది.  
 
ఈ తుఫాను ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ మార్చి 22వ తేదీ ఉదయం నాటికి బంగ్లాదేశ్, దానిని ఆనుకునివున్న ఉత్తర మయన్మార్ తీరానికి ఈ నెల 23వ తేదీకి చేరుకుంటుందని ఐఎండీ తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలగాణ రాష్ట్రాలతో పాటు యానాం, అండమాన్ నికోబార్ దీవులలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది.