గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : శుక్రవారం, 18 మార్చి 2022 (23:11 IST)

ఆరూరు గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించిన ఆర్కే రోజా (video)

నిండ్ర మండలం ఆరూరు గ్రామ నూతన సచివాలయ భవనాన్ని ప్రారంభించారు ఎమ్మేల్యే ఆర్కే రోజా. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్ఠాత్మకంగా పరిపాలనను ప్రజల అందుబాటులోకి తీసుకురావడానికి వారి గ్రామం లోనే సచివాలయం వ్యవస్థకు నాంది పలికిన విషయం తెలిసిందే.
 
గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం అని చెప్పిన గాంధీజీ కలలను జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయాల రూపకల్పన జరిగింది. గ్రామాల్లో వాలంటీర్లు, సచివాలయం సిబ్బందిలను అందుబాటులో ఉంచి సమస్యలను దగ్గరుండి పరిష్కరించడానికి ఈ వ్యవస్థ చాలా ఉపయోగపడుతుంది అన్నారు.
 
శుక్రవారం నాడు నిండ్ర మండలం అరూరు గ్రామంలో 40 లక్షలతో ఎంజిఎన్ఆర్ఇజిఎస్ నిధులతో నిర్మించిన సచివాలయం భవనాన్ని ఎమ్మేల్యే రోజా ప్రారంభించారు.  
 
ఈ సందర్భంగా ఆమె సచివాలయం భవన స్థలదాత సాల్వ సుందర రామరాజు గారి కుటుంబ సభ్యులను ప్రశంసించారు. ప్రభుత్వం అందించే పథకాలు లబ్దిదారులకు పూర్తిగా చేరాలని ఏర్పాటు చేసిన ఈ సచివాలయంను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.