Tran: Aries..; ట్రాన్: ఏరీస్.. డిస్నీ నుండి కొత్త పోస్టర్, ట్రైలర్ విడుదల
Tron: Aries, Disney new poster
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న “ట్రాన్: ఏరీస్” చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్, ట్రైలర్‌ను డిస్నీ విడుదల చేసింది. సైన్స్ ఫిక్షన్‌లో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ట్రాన్ (1982), దాని సీక్వెల్ ట్రాన్: లెగసీ (2010) తర్వాత వస్తున్న మూడవ చాప్టర్ ఇది. ఈ చిత్రం భారతదేశంలో అక్టోబర్ 10, 2025న ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది.
కథా నేపథ్యం: డిజిటల్ ప్రపంచం నుండి రియల్ ప్రపంచంలోకి అడుగుపెట్టే అధునాతన ప్రోగ్రామ్ ఏరీస్ ఒక ప్రమాదకరమైన మిషన్‌లో నడిచే కథ ఇది. ఇదే మానవజాతి మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (A.I.) జీవుల మధ్య మొదటి భేటీగా నిలుస్తుంది.
సినిమా ప్రత్యేకతలు: జెఫ్ బ్రిడ్జెస్ మళ్లీ తన పాత్రలో కనిపించడం ఫ్రాంచైజ్ అభిమానులకు పెద్ద ఆకర్షణ.
జారెడ్ లేటో ప్రధాన పాత్రలో నటించగా, గ్రెటా లీ, ఎవాన్ పీటర్స్, హసన్ మినహాజ్, జోడీ టర్నర్-స్మిత్, గిల్లియన్ ఆండర్సన్ వంటి అంతర్జాతీయ తారాగణం కనిపించనున్నారు.
గ్రామీ అవార్డు గెలుచుకున్న బ్యాండ్ నైన్ ఇంచ్ నైల్స్ అందించిన ప్రత్యేక గీతం “As Alive As You Need Me To Be” సినిమాకి మరో ముఖ్య హైలైట్. దర్శకత్వం జోయాకిమ్ రోన్నింగ్ వహించగా, సీన్ బేలీ, జారెడ్ లేటో, స్టీవెన్ లిస్బెర్గర్ వంటి ప్రముఖులు నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు.
డిస్నీ ప్రతినిధులు మాట్లాడుతూ: “ట్రాన్: ఏరీస్ అనేది కేవలం విజువల్ స్పెక్టాకిల్ మాత్రమే కాదు, మానవజాతి మరియు టెక్నాలజీ మధ్య సంబంధాన్ని కొత్త కోణంలో చూపించే ప్రత్యేక అనుభవం. అక్టోబర్ 10న థియేటర్లలో ప్రేక్షకులు తప్పక ఆస్వాదించాల్సిన చిత్రం ఇది” అన్నారు.